![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -252 లో.....స్నేహ ఇంట్లో లేదన్న విషయం వీరుకి ఇషిక చెప్తుంది. దాంతో శకుంతలకి తెలిసేలా చేసి ఇంట్లో గొడవ చెయ్యాలని వీరు, ఇషిక అనుకుంటారు. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తారు. స్నేహ రాకపోవడంతో స్నేహని తీసుకొని వస్తానని పైకి వెళ్తుంది ఇషిక. స్నేహ ఇంట్లో లేదన్న విషయం తెలిసి గొడవ జరుగుతుందని ఇందుమతి వాళ్ళు భయపడుతారు. పైకి వెళ్ళిన ఇషిక కిందకి వచ్చి.. స్నేహ ఇంట్లో లేదు అత్తయ్య గారు అంతా వెతికానని అంటుంది. అందరు షాక్ అవుతారు. అసలు ఏం జరుగుతుంది.. ఈ ఇంట్లో ఒక ఆడపిల్ల వెళ్ళిపోయి పరువు తీసింది.. ఇప్పుడు మరొక ఆడపిల్ల కూడా అలాగే చేసిందా ఏంటని శకుంతల కోప్పడుతుంది.
అప్పుడే రుద్ర ఏమైందంటూ ఎంట్రీ ఇస్తాడు. అయ్యో మీకు తెలియదు కదా బావ.. స్నేహ ఇంట్లో లేదని వీరు అంటాడు. ఇప్పుడు ఎవరన్నారు స్నేహ లేదని.. అన్నయ్య తలనొప్పిగా ఉంది నాకు టాబ్లెట్ తీసుకొని రమ్మని చెప్పింది స్నేహ అని రుద్ర చెప్తాడు. స్నేహ అని రుద్ర పిలవగానే పైనుండి స్నేహ వస్తుంది. తనని చూసి ఇషిక, వీరు షాక్ అవుతారు. నేను వచ్చినప్పుడు నువ్వు లేవు కదా అని ఇషిక అనగానే అప్పుడు స్నానం చేస్తున్నాను వదిన అని స్నేహ చెప్తుంది. ఈ ఇంట్లో అందరికి తొందరపాటు ఎక్కువ అయిందని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత అసలు ఏమైందని వీరు, ఇషిక తల పట్టుకుంటారు. మరొకవైపు గంగకి బాక్సింగ్ నేర్పించడానికి అయ్యగారిని ఒప్పిస్తానని అమ్మగారు చెప్పారని పైడిరాజుకి లక్ష్మీ చెప్తుంది.
ఆ తర్వాత చాలా థాంక్స్ అన్నయ్య.. నేను ఏ తప్పు చెయ్యలేదని రుద్రతో స్నేహ అంటుంది. నాకు తెలుసు అమ్మా అని రుద్ర అంటాడు. ఎవరో కావాలనే రైడ్ జరిపించారని స్నేహ చెప్తుంది. పార్టీలు వద్దని అనడం లేదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |